ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు.
ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని చెప్పారు. అప్పటి వరకు మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించాలన్నారు.