తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు.
ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దృష్టిపెట్టాలని సూచించారు.