తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. నేను టీడీపీ శ్రేణులకు ఇచ్చే సలహా ఏంటంటే.. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేపట్టండి. లేదంటే చచ్చిపోతారు’ అని వర్మ ట్వీట్ చేశాడు.