లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది.
ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.