దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.