కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు.
ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.