కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెలియజేసిన సమీరా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను.
నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాలని పేర్కొంది. అయితే సోమవారం ఉదయం నెటిజన్స్ సమీరా పిల్లల గురించి ఆరాలు తీయగా, హన్స్, నైరాలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చింది.
గత వారం హన్స్ కు అధిక జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పితో కాస్త అలసటగా ఉన్నాడు. నాలుగు రోజులు ఇలానే ఉండంతో కరోనా పరీక్షలు చేయించాము. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొదట్లో నాకు చాలా భయం వేసింది. ఇక కూతురు నైరా గురించి మాట్లాడుతూ.. నైరాలో లక్షణాలు వెంటనే కనిపించడం ప్రారంభించాయి. పారాసెట్‌మాల్, కోల్డ్‌కు సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చాను. క్షేమంగానే ఉంది. సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది. పిల్లలలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యులు మల్టీ విటమిన్స్, విటమిన్ సి సిఫారస్ చేస్తున్నారు.