దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 2 లక్షల 73 వేల 810 మంది వైరస్ బారిన పడ్డారు. వరసగా 5వ రోజూ కేసులు 2 లక్షలు దాటాయి.
మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఏకంగా 1,619 మంది మరణించారు. ఒక్క రోజులో సంభవించిన మరణాల్లో కూడా ఇవే అధికం. దేశంలో కరోనా మరింత ప్రమాదకరంగా మారుతోంది. రికవరీ రేటు తక్కువవుతోంది.