తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు 8 తేదీల్లో అత్యధికంగా 14 మంది చొప్పున మరణించారు.
ప్రస్తుతం 24 గంటల వ్యవధిలోనే 15మంది మృత్యువాత పడడం గమనార్హం. కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మరణాల సంఖ్య 1,824కు పెరిగింది.