తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.
వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 మంది బాధితులు మరణించారు.
కాగా, మొత్తం కేసుల్లో ప్రస్తుతం 37,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 24,156 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు ఉండగా, మేడ్చల్ జిల్లాలో 488, రంగారెడ్డి 407, నిజామాబాద్‌లో 367 చొప్పున ఉన్నాయి.