మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.