వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి గట్టి షాక్ తగిలింది..వరంగల్ లో గత 25 ఏండ్లుగా బీజేపీకి వివిద హోదాల్లో సేవ చేసి బీజేపీ ని నిలబెట్టిన సీనియర్ బీజేపీ నాయకుడు గందె నవీన్ గారు,వారి సతీమణి గందె కల్పన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు..
ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..సుదీర్గ రాజకీయ అనుభవం, గత 25 ఏండ్లుగా బీజేపీకి బలమైన నేతగా వరంగల్ జిల్లాలో బీజేపీ పార్టీలో కీలకుడిగా ఉన్నారు గందె నవీన్..బీజేపీని వరంగల్ లో బలోపేతం చేయటంలో ముఖ్యపాత్ర పోషించిన నవీన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై ఈ రోజు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు..
మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి ఈ రూపంలో ఊహించని షాక్ ను ఇచ్చారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..గందె నవీన్,కల్పన గార్ల రాజకీయ భవిష్యత్ అందిస్తామని,పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు..టీఆర్ఎస్ పార్టీని నమ్మి వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని నవీన్ గారికి పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..