సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో పాటు ఆర్ డి ఓ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు యస్ కే బాషా,భరత్ మహాజన్ తదితరులు మంత్రి జగదీష్ రెడ్డి వెంట స్థల పరిశీలనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యాపేటలో వ్యాపార వాణిజ్య, వర్తక గృహ సముదాయాల నుండి వచ్చే చెత్తను పరిశుభ్రం చెయ్యడంతో పాటు నిండిపోయిన సెప్టిక్ ట్యాన్క్ ల నుండి వెలువడే మలినాన్ని శుద్ధి చేసేందుకే ఈ ప్లాంట్ల ఏర్పాటు అని ఆయన తెలిపారు. అందుకు గాను సూర్యాపేట మున్సిపాలిటీ కి అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.