తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు.
1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇందులో 22,118 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 1,26,235 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.