మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు.
53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.