దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 2,17,353 మందికి కరోనా సోకగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా మరణాల సంఖ్య 1,74,308గా ఉంది. తాజాగా 1,18,302 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనాను జయించారు. 15,69,743 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 14,73,210 కరోనా టెస్టులు చేశారు.