గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.
తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే కాంగ్రెస్ నాయకులే కారణం అని స్పష్టం చేశారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసింది తెలంగాణ. ఆంధ్రా 29 లక్షలతో మూడో స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ర్టమైంది అని సీఎం స్పష్టం చేశారు.