తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది.
ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది.