తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం,ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణ వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పించారన్నారు.
అదే మంత్రి మల్లారెడ్డిపై వందల ఆరోపణలొస్తున్నా.. బర్తరఫ్ చేయట్లేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆమె పలు విమర్శలు చేశారు. అణగారిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.