ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు రిజర్వేషన్ల జాబితాను ఇవాళ విడుదల చేశారు.
1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్, 32వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. 22, 42, 59 డివిజన్లను ఎస్సీ మహిళలకు, 40, 43, 52, 60 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు, 28, 29, 30, 33, 34, 38. 46, 47, 48, 57 డివిజన్లు బీసీ మహిళలకు, 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 డివిజన్లను బీసీ జనరల్‌కు, 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 డివిజన్లను జనరల్ మహిళలకు, 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41. 45. 49. 50 డివిజన్లను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.