దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 203/5 పరుగులు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్.. 18 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 59 బంతుల్లో 122 పరుగులతో చెలరేగాడు. టీ20ల్లో పాకిస్థాన్కు అత్యధిక రన్ ఛేజింగ్ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో 4 T20ల సిరీస్లో పాక్ 2-1తో ఆధిక్యంలో ఉంది.