తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు.
ఈ ఉగాది కొవిడ్ వైరస్ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ వేర్వేరుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.