తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని నిర్ణయించారు.
టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు నంబర్ ఎంటర్ చేయాలని నిబంధన పెట్టారు.
దీంతో చాలామంది గందరగోళానికి గురై అధికారులను సంప్రదిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రేషన్‌కార్డు లేకున్నా 25 కిలోల బియ్యం అందజేయాలని ఆదేశాలిచ్చారు. సమీపంలోని రేషన్‌షాపు నంబర్‌ను దరఖాస్తుల్లో తప్పనిసరిగా పేర్కొనాలని అధికారులు సూచిస్తున్నారు.