తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.