తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది.
ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 21,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 14,431 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతం ఉండగా, రికవరీ రేటు 93 శాతంగా ఉన్నదని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 355, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 258, నిజామాబాద్ 244 చొప్పున ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో రోజురోజుకు వైరస్ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. నిన్న ఒక్కరోజే 79,027 నమూనాలను పరీక్షించింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,10,68,003కు చేరిందని వెల్లడించింది.