Home / SLIDER / మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్ నివాళులు

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్ నివాళులు

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నివాళులు అర్పించారు.దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం,  మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని సీఎం అన్నారు.

కుల,లింగ వివక్షకు తావు లేకుండా,   విద్య, సమానత్వం ద్వారానే సమాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా ఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆరున్నర ఏండ్ల తెలంగాణ స్వయం పాలనా పక్రియ, ఫూలే వంటి మహనీయుల స్పూర్తితోనే కొనసాగుతున్నదన్నారు.ఏటా దాదాపు 45 వేల కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా వర్గాల సమున్నతికోసం ఉపయోగపడుతున్నాయని సీఎం చెప్పారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో  తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.

విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదన్నారు. గురుకుల విద్యావ్యవస్థల్లో సాధిస్తున్న ఫలితాలు, జ్యోతిబాఫూలే అందించిన స్పూర్తి ఫలాలేనని సీఎం కేసీఆర్ అన్నారు. బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు, సత్పలితాలనిస్తున్నాయన్నారు. మహిళలకు విద్య, వైద్యం, రక్షణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి సదుపాయాలను ప్రభుత్వం మెరుగు పరిచిందన్నారు.బడుగు బలహీన వర్గాల ఆర్ధిక పురోగతికి దోహదపడుతూ,  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ,  దేశానికే ఆదర్శంగా నిలవడం వెనక మహాత్మా ఫూలే వంటి దార్శనికుల స్పూర్తి ఇమిడివున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat