తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు.
దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.