తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు.
సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే సభలో తల్లి విజయలక్ష్మితో కలిసి పాల్గొననున్నారు