మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో మైనార్టీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనారిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు.
పేదరికం తొలగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 210 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. పేద మైనార్టీ యువతుల పెండ్లిళ్ల కోసం షాదీముబారక్ పథకం ద్వారా రూ.100,116 ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.మైనార్టీల అభ్యున్నతి, వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉర్దూను తెలంగాణలో రెండో అధికార భాషగా గుర్తించామన్నారు.
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంకు లింకేజీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే షూరిటీ ఇచ్చి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుందన్నారు. ముస్లిం మైనార్టీల పేదరికానికి కారణం 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనే అన్నారు. అన్ని వర్గాలు బాగుంటేనే బంగారు తెలంగాణ
సాధ్యమవుతుందన్నారు.ఎన్నో ఏండ్లుగా మంత్రిగా పని చేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. చేయలేదు. పవర్ లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మైనార్టీ రాష్త్ర నాయకుడు మహ్మద్ ఫహీముద్దిన్, శాది ఖానా చైర్మన్ హఫీజుద్దిన్ పాషా, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఫరీదుద్దిన్, త్రిపురారం మైనార్టీ ఎన్నికల ఇంచార్జ్ అనీస్ ముక్తాదర్ , మౌజం అలీ, ఎండీ హబీబ్
తదితరులు పాల్గొన్నారు.