త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
