తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు.
అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న అప్పును సమయానికి తీర్చలేకపోయారు. ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది.
ఈ విషయమై సదరు సంస్థ కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం.. వారికి ఏడాది జైలు శిక్ష విధించింది.