ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. దీనిని విజయవంతంగా పూర్తిచేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 50 శాతం మార్కులు సాధించిన వారిని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిప్రదికన నియమిస్తుంది.
మొత్తం పోస్టులు: 1679
ఇందులో ఎలక్ట్రిషన్, లైన్మెన్, ఎస్ఎస్ఓ, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: స్కిల్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. అన్స్కిల్డ్ పోస్టులకు ఎనిమిదో తరగతి పాసై, సెమీ స్కిల్డ్ పోస్టులకు ఇంటర్ పాసై, ఇంగ్లిష్, హిందీలో టైపింగ్ చేయగలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ. 590, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.295
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 20
వెబ్సైట్: www.beciljobs.com