దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది.
అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 1,66,177 మృతి చెందారు.ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు పేర్కొంది.