తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్.. పార్టీ పదవికి రాజీనామా చేసి, షర్మిలకు మద్దతు పలికారు. ఈమేరకు సోమవారం ఆమె షర్మిలను కలిసినట్లు లోట్‌సపాడ్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
అలాగే, కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన ఒకరు, నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఆరుగురు మాజీ సర్పంచ్‌లు, పలువురు న్యాయవాదులు షర్మిలను కలిసి మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా లోట్‌సపాండ్‌లో సోమవారం ఆయన చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు.