Home / MOVIES / ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?

ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?

మోస్ట్‌  అవెయిటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్‌ పీరియాడికల్‌ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్‌ 13న దసరా సందర్భంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవగణ్‌, అలియా భట్‌.. హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడీ ఇలా సినిమాను అంచనాలకు ధీటుగా రూపొందిస్తున్నారు జక్కన్న. 

పునర్జన్మల బ్యాక్‌డ్రాప్‌తో..

ఫిక్షనల్‌ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుసుకుని ఎలా పోరాటం చేశారనేదే కథ. నిజానికి వీరిద్దరూ అసలు కలుసుకోలేదు. కానీ కలుసుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందనేదే కథాంశంగా ఊహించుకుని కథ తయారు చేసి ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అసలు రాజమౌళి ట్రిపులార్‌ కథను ఎలా మలిచి ఉంటాడనే దానిపై ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్తొకటి హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే… రాజమౌళి  ‘ఆర్ఆర్‌ఆర్‌’ను పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోయారు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోయారు. ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమర యోధులు మళ్లీ 1940 ప్రాంతంలో జన్మిస్తారు. 1940లో పుట్టిన అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌… కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ .. బ్రిటీష్‌ వారిపై పోరాటం చేస్తారు. ఆ కథనే రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. 

ఫస్టాఫ్‌ ఎన్టీఆర్‌.. సెకండాఫ్‌ చరణ్‌

ట్రిపులార్‌ చిత్రంలో ఫస్టాఫ్‌ అంతా ఎక్కువ భాగం ఎన్టీఆర్‌ మీదనే సినిమా రన్‌ అవుతుంది. పునర్జన్మలో భాగంగా పుట్టిన ఎన్టీఆర్‌ పాత్ర దొంగ.  ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే రామ్‌చరణ్‌ మీదనే ఎక్కువ కథ రన్‌ అయ్యేలా.. ఇద్దరు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసేలా జక్కన్న కథను రాసుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది. పునర్జన్మ తర్వాత రామ్‌చరణ్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఓ దొంగ పోలీస్‌ మధ్య సినిమా ఉంటుంది. వీరిద్దరూ మధ్య మంచి యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా జక్కన్న ప్లాన్‌ చేశాడని టాక్‌. మరి ఈ కథలో నిజానిజాలేంటో తెలియాలంటే విడుదల వరకు ఆగక తప్పదు. 

Source :- ABN

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat