ఈ రోజు మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోలివుడ్ టాప్ హీరో విజయ్ దళపతి పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చి తన ఓటు వేయడంపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారని, ఎవరిని ఓడించాలో చెప్పకనే చెప్పారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అధికమై, ఇంకా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగానే విజయ్ ఇలా సైకిల్‌పై వచ్చారని అంటున్నారు. విజయ్ సైకిల్‌పై వచ్చిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.