సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు.
ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు శుభాకాంక్షలని ప్రకటనలో కేసీఆర్ తెలిపారు.