తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు..
రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టేదే కాదు. తెలంగాణ వచ్చి ఉండేదే కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే అసలు కారణం అని చెప్పారు.