తెలంగాణలో రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతితో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.
ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదేంటి అంటే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. ప్రజలను కరపత్రాల ద్వారా ఓట్లు అడుగుదామని జానారెడ్డి అన్నారని వార్తలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ ఒక్క సీటు ద్వారా ప్రభుత్వం పడిపోదని.. బీజేపీ అదే ఒక్క సీటు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గంలో చేసిన పలు సంక్షేమాభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు చేరాయి.. అవే నన్ను గెలిపిస్తాయని ఆయన అన్నారు.