తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.