తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ముక్కు నోరు కవర్ అయ్యేలా మాస్కు పెట్టుకుందాం.