ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన పడ్డారు సెకండ్ వేవ్ మహారాష్ట్రలో విజృంభిస్తోంది.