తెలంగాణలో ఎన్నికలు జరిగితే కొంతకాలంగా ఏపీ అధికారక వైసీపీ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు.
అటు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఇటు జగన్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలవడంతో ఏం జరుగుతుందా? అని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.