ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ ముష్టికోవెల గ్రామానికి వెళ్లారు.
ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బత్తిన వెంకటరాముడు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు ముష్టికోవెల గ్రామానికి చెందిన తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు అయింది.