సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది బ్యూటీ డాల్ పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజి బిజీగా మారిపోయింది.
ముఖ్యంగా ఇప్పుడీ సొగసరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా హయ్యస్ట్ రెమ్యునరేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న ఆదరణతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో గోల్డెన్ చాన్స్‌ను దక్కించుకుంది.
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే తొమ్మిదేళ్ల తర్వాత పూజా హెగ్డే నటిస్తోన్న తమిళ చిత్రమిదే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.