పసుపు పాలతో హాయిగా నిద్ర పాలలో సెరొటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దీంతో రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది.
అలాగే పసుపులో ఉండే కుర్ క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది