దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన మొత్తం కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కు పెరిగింది.
మరో 23,907 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,68,457 యాక్టివ్ కేసులున్నాయని, మహమ్మారి ప్రభావంతో మొత్తం 1,60,441 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ డ్రైవ్‌లో 5,08,41,286 డోసులు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,25,628 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. నిన్నటి వరకు మొత్తం 23,64,38,861 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది.