Home / NATIONAL / టూరిజం రాష్ట్రంలో ఎలక్ర్టిక్ బస్సులు

టూరిజం రాష్ట్రంలో ఎలక్ర్టిక్ బస్సులు

దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సులను మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది.

పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్ – 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేసింది. ఈ బస్సులను ఈ రోజు మంగళవారం నాడు (23.03.2021) గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. ఒలెక్ట్రా సంస్థ ఇప్పటికే వివిద రాష్ట్రాలకు ఎలక్ర్టిక్ బస్సులను సరఫరా చేసింది. ముంబాయి, పూణే, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళ, డెహ్రడూన్, సిల్వాస్వాలో ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. మరో 1225 బస్సులను సిద్ధం చేస్తోంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను గోవా రాష్ట్రంలో నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. గోవా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒలెక్ర్టా బస్సులో తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే గోవాలో ప్రవేశపెట్టిన ఈ 50 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయన్నారు.

12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్ తో సహా 48 మంది ప్రయాణికుల ప్రయాణించేలా సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీల ఏర్పాటు, వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ కూడిన సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు.

బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది.

దేశ రహదారులపై పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 4 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. CO2 ఉద్గారాలను 13000 టన్నుల మేరకు తగ్గించింది. ఇది లక్ష చెట్లు నాటాడానికి సమానం. మనాలి నుండి రోహ్తాంగ్ పాస్ వరకు ఎత్తైన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా నమోదయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat