కేసీఆర్ కిట్ పథకం కింద లబ్ధిదారుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ పథకం వచ్చిన తర్వాత 50 శాతానికి పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,91,275 మంది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్రవరి) వరకు 2,58,341 మంది లబ్ది పొందారని పేర్కొన్నారు.
ఈ పథకం కోసం 2017-18లో రూ. 246.38 కోట్లు, 2018-19లో రూ. 273.83 కోట్లు, 2019-20లో రూ. 392.04 కోట్లు, 2020-21(ఫిబ్రవరి) వరకు రూ. 263.65 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రభుత్వానికి ఎంతో ఆదరణ లభించిందన్నారు. అమ్మ ఒడి వాహనాలను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. గర్భిణి స్ర్తీలకు మంచి ఆరోగ్యం కోసం అంగన్‌వాడీల నుంచి పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.