తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.